హుజూరాబాద్‌ : మండలంలోని తుమ్మనపల్లి గ్రామ శివారులో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై కారు లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాకతీయ కాలనికి చెందిన మల్లిఖార్జున-సులోచనల కుమార్తె అయినా శ్వేత(29) మండలంలోని సింగాపూర్ గ్రామంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తుండగా అదే కళావాలలో ట్రిపుల్‌ఈ డిపార్ట్‌మెంట్‌లో సహా అధ్యాపకుడిగా పనిచేస్తున్న నాగరాజు(32)తో ఆరు సంవత్సరాల క్రితం వివాహాం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలోనే భార్య భర్తలిద్దరూ శుక్రవారం ఉదయం కారులో కళాశాలకు బయల్దేరారు. ముందు వెళ్తున్న వాహానాన్ని తప్పించేందుకు ముందుకు వెళ్లగా కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టంతో భార్యభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు వరంగల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శ్వేత మృతి చెందగా నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. వీరి మృతితో ఇద్దరు చిన్నారులు ఒంటరిగా మారారు. మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకొని రోదించిన తీరు పలువురిని కలిచి వేసింది…