వరంగల్-కరీంనగర్ రహదారిపై వాహనం బోల్తా

ఆదివారం ఎల్కతుర్తి మండలంలోని పెంచిక లేపేట గ్రామ పరిసరాల్లో ప్రధాన రహదారిపై పండ్లలోడ్ తో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు పై బోల్తా పడింది. ఫలితంగా వరంగల్ – కరీంనగర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాకపోకలను పునరుద్దరించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. వాహనాన్ని క్రేన్ సహాయంతో పక్కకు తీశారు.

Advertisement

సుమారు గంట తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.