హన్నకొండ కాంగ్రెస్ భవన్ లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ జెండాను ఎర్రబెల్లి స్వర్ణ ఎగురవేశారు. జెండా ఎగురవేసిన అనంతరం యూత్ కాంగ్రెస్ వర్గీయులు మధ్య మాటామాటా పెరిగి కుమ్ములాట మొదలయ్యింది. దీంతో ఒకరి నొకరు నెట్టివేసుకున్నారు . ఇరువర్గాల వారిని ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్, సిటీ యూత్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ సముదాయించారు.

భూపాలపల్లి లో:

జిల్లా కేంద్రములో అఖిల భారత జాతీయ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు విస్లావత్ దేవన్ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవన్,చల్లూరి మధులు మాట్లాడుతూ దేశంలో యువకులు రాజకీయాల్లోకి రావాలనే సంకల్పం రాహుల్ గాంధీ గారి ఆలోచన చాలా గొప్పదని అన్నారు. అదే విధంగా యువత తలుచుకుంటే ఏదైనాసాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో బట్టు కర్ణాకర్, కే.రాజన్న, అక్కపల్లి సతీష్, బౌతు రాజేష్, రాజు, కస్తూరి రమేష్, దుర్గం భిక్షపతి, బౌతు రమేష్, శివ, ప్రశాంత్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.