అయోధ్య వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. కాజీపేట నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది భారతీయ రైల్వే. కాజీపేట నుంచి ఈ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవల అయోధ్యలో బాల రాముని పట్టాభిషేకం వైభవంగా సాగింది. అయితే నాడు బాల రాముని ప్రతిష్టా మహోత్సవం నిర్వహించినసమయం నుండి రాముల వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. యావత్ భారతావనిలోని భక్తులు రైళ్లు, బస్సులు, ఇతర మార్గాల ద్వార అయోధ్య కు చేరుకుంటున్నారు. అటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా, రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్రంలోని కాజీపేట నుండి అయోధ్యకు నడిపే రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.

తన సొంత ప్రదేశమైన అయోధ్యలో బాలరాముడు కొలువుతీరాడు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా అయోధ్య రాంలల్లాను దర్శించుకునేందుకు బారులు తీరారు. అయోధ్యలోని బాలరాముడుని దర్శించుకునేందుకు భారత రైల్వే శాఖ అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. కాజీపేట జంక్షన్ నుంచి అయోధ్యకు 15 రైళ్లు, మరో 15 రైళ్లు అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న సాయంత్రం 6.20 గంటలకు(07223) నెంబర్ తో మొదటి రైలు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు అయోధ్య రైల్వే స్టేషన్ కు చేరుకొనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక రైలు జనవరి 30 ఫిబ్రవరి 1,3,6,8,10,12,14,16,18,20, 22,24,26,28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు కాజీపేటలో బయలుదేరనున్నాయి. అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2,4,6,9,11,13,15,17 19,21,23,25,27,29 మార్చి 2న మధ్యాహ్నం 2.20 గంటలకు అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు కాజీపేటకు చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైలు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, చంద్రాపూర్, నాగపూర్, హిటాచి భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ రైల్వే స్టేషన్లలో నిలుపుదల చేయనున్నట్లుతెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన భక్తులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని అధికారులు కోరారు.