వరంగల్ కాశీబుగ్గ చెప్పులు కొనుకోవడానికి వెళ్లి రోడ్ ప్రమాదం లో

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రగాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఎస్సై అబ్దుల్‌ రహీం కథనం ప్రకారం.

వరంగల్‌ లేబర్‌కాలనీకి చెందిన ఎండీ సైఫ్‌ (20), గబీర్‌ అనే ఇద్దరు యువకులు మహబూబీయా పంజతన్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటరు చదువుతున్నారు. వీరిద్దరు వరంగల్‌ కాశీబుగ్గలో చెప్పులు కొనుక్కొని ధర్మారంలో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి ఆదివారం సాయంత్రం మోటార్‌ సైకిల్‌పై బయలు దేరారు. ధర్మారం సమీపంలోని మిల్లులోకి ఓ లారీ వెళుతుండగా వీరిద్దరు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ ఆ లారీని ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ సంజీవరావు, ఎస్సై అబ్దుల్‌ రహీం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వీరిద్దరిని చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ సైఫ్‌ మృతి చెందాడు. గబీర్‌ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెప్పారు.