తెలుగు తేజం, టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారీ ఓ ఇంటివాడయ్యాడు. వరంగల్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతిరాజ్‌తో హన్మకొండలో హనుమ వివాహం వైభవంగా జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. కాగా 20వ తేదీన వీరి రిసెస్షన్ జరుగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఆంధ్ర క్రికెట్ జట్టు తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన హనుమ విహారి గత ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. భారత జట్టు తరఫున 4 టెస్టులు ఆడిన విహారి 23.9 స్ట్రైక్‌ రేటుతో 167 పరుగులు చేశాడు. వివాహం చేసుకున్న సందర్భంగా హనుమకు పలువురు క్రికెటర్లు, అభిమానులు అభినందనలు తెలిపారు.