వరంగల్ కు చెందిన 11 ఏండ్ల విగ్నేష్ కోరిక

అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూడాలని కోరుకున్న వరంగల్ కు చెందిన 11 ఏండ్ల విగ్నేష్ కోరిక నెరవేరింది. కేసీఆర్ తన పుట్టిన రోజున స్వయంగా విగ్నేష్ ను ప్రగతి భవన్ ఆహ్వానించారు. సిఎం ఆహ్వానం మేరకు తల్లిదండ్రుల తోడుతో ప్రగతి భవన్ చేరుకున్న విగ్రేష్ ను ముఖ్యమంత్రి పలుకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి బాబులో హుషారు నింపారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.