మన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఎన్ రవికిరణ్ నియమితులయ్యారు. శనివారం రాత్రి కమిషనర్ వీపీ గౌతమ్ బదిలీ అయిన విషయం తెలిసిందే . ఈమేరకు మున్సిపల్ ‌శాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న N రవికిరణ్‌ను గ్రేటర్ కమిషనర్‌గా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. 1997 గ్రూప్ 1 అదికారి అయిన రవికిరణ్ ప్రభుత్వ సర్వీస్‌లో చేరారు.

2000 సంవత్సరం నుంచి హైదరాబాద్ మ హా నగరపాలక సంస్థలో పనిచేస్తున్నారు. చార్మినార్ జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అదనపు కమిషనర్‌గా పబ్లిక్ హెల్త్, పారిశుధ్య విభాగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అయనను గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది

బాధ్యతల స్వీకరణ

గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా ఎన్ రవికిరణ్ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్‌లో పని చే సిన ముగ్గురు కమిషనర్లు IAS అధికారులు కాగా, ఎన్ రవికిరణ్ మాత్రం గ్రూప్ అధికారి కావడం గమనార్హం.