వరంగల్ కొరియర్ సర్వీసెస్ పై ఎక్సైజ్ శాఖ దాడులు

డిసెంబర్ నెలలో ఎన్నికలు సజావుగా చేపట్టేందుకు ఇతర రాష్ట్రాల మద్యం జిల్లాకు రాకుండా అడ్డుకునేందుకు వరంగల్ ఎక్సైజ్ శాఖ డీటీఎఫ్ (డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) సిబ్బంది కొరియర్ సర్వీసెస్ పై దాడులు చేసారు. వరంగల్, కాజీపేటస్టేషన్ల సమీపంలో ఉన్న కొరియర్ పార్సిళ్లను తనిఖీ చేశారు. అనంతరం ఎక్సైజ్ డీటీఎఫ్ వరంగల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వేముల శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ అకున్, వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేష్ రాథోడ్, అర్బన్ జిల్లా ఎక్సైజ్ పర్యవేక్షణాధికారి ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కల్తీ మద్యం, అక్రమ మద్యం నివారించేందుకు ఈ దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఎన్డీపీ (సుంకం చెల్లించని మద్యం) దిగుమతి కాకుండా పాత నేరస్తులపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు.