అత్యంత ప్రమాదకరమైన ఓ పాము ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులపై విషం చిమ్మింది. గాఢ నిద్రలో ఉండగా కాటు వేసింది. వారిలో ఒకరు ప్రాణాలు విడువగా మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రు తండాలో చోటుచేసుకుంది. వివరాలు… జాతోట్‌ రవి (38), అతని భార్య, కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఐదడుగుల కట్లపాము గత రాత్రి ముగ్గురినీ కాటు వేసింది. భర్త జాతోట్‌ రవి మృతి చెందగా.. భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి వారిని తరలించారు. కట్లపాము అత్యంత విషపూరితమైందని స్నేక్‌ క్యాచర్లు చెప్తున్నారు.