వరంగల్ నగరంలోని రామన్నపేటలో బొడ్రాయి ( గ్రామ దేవత ) ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు . 24వ డివిజన్ కార్పొరేటర్ , బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ సభ్యులు గుండు అశ్రితవిజయ్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు . రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గుండు సుధారాణి – ప్రభాకర్ దంపతులు పాల్గొని పూజల్లో పాల్గొని మాట్లాడారు…

Advertisement

గ్రామదేవతల ఆశీర్వాదంతో అంతా ఆయురారోగ్యాలతో , అష్టఐశ్వరాలతో ఉం డాలని కోరుకున్నట్లు తెలిపారు . కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు గుండు విజయ్ రాజ్ , పార్టీ డివి జన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ , వడ్నాల నరేం దర్ , పూజారి కుమారస్వామి , రుద్ర శ్రీనివాస్ , వాడి కనాగరాజు,

శ్రీరాముల సురేశ్ , గట్టు చందు , మర్రి రవీందర్ , అనుమాండ్ల నాగరాజు , తాళ్లపెల్లి సంతో సుష్ , బొమ్మకంటి క్రాంతి , శ్రీనాథ్ , శ్రీహరి , సంజీవ సీహెచ్ లలిత , రజిత , హేమలత , జయశ్రీ , షర్మిల , కూచన శంకర్ పాల్గొన్నారు .