చికెన్ సెంటర్ యజమానికి జరిమానా

వరంగల్ ఎస్ వి ఎస్ రోడ్డులోని స్నేహ చికెన్ సెంటర్ యజమాని కి బల్దియా ఆరోగ్య అధికారి డాక్టర్ రాజిరెడ్డి 5వేల జరిమానా విధించారు. సోమవారం ప్రజావాణి లో అందించిన ఫిర్యాదుపై స్పందించిన ఎం హెచ్ ఓ డాక్టర్ రాజిరెడ్డి వెంటనే చికెన్ సెంటర్ ను తనిఖీ చేశారు. చికెన్ సెంటర్ నిర్వహణ పరిశుభ్రంగా లేకపోవడాన్ని గమనించిన రాజిరెడ్డి 5 వేల జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్చార్జి అనిల్, జగన్, జవాన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.