ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసుశాఖలో కానిస్టేబుళ్లు , ఎస్సైల ఉద్యోగ నియామకాల కోసం JNS నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు . బయోమెట్రిక్ విధానంతో వారిని పరీక్షించి లోపలకు అనుమతించారు . ఎత్తును కొలిచిన తర్వాత 100 మీటర్లు , లాంగ్ జంప్ , షాట్ పుట్ అంశాలలో పరీక్షలు నిర్వహించారు . ఇక్కడ అర్హత సాధించిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు . మూడు రోజులపాటు నిర్వహించే పరీక్షలకు 5278 మంది దరఖాస్తు చేసుకున్నారు . మొదటి రోజు 1159 మంది హాజరుకావాల్సి ఉండగా 801 మంది వచ్చారు . వీరిలో 295 మంది అర్హత సాధించలేదు . ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ మాట్లాడుతూ .

పరీక్షలకు వచ్చే మహిళా అభ్యర్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు . ఈసారి అధిక సంఖ్యలో ఎంపికయ్యే అవకాశముందన్నారు . పరీక్షలను నిర్వహిస్తున్న ప్రదేశంలో తక్కువ ధరకు తినుబండారాలు లభించేలా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు . తల్లులు ఈవెంట్లను పూర్తి చేసుకొని వచ్చే వరకు చిన్న పిల్లల ఆలనాపాలనను వారి తల్లిదండ్రులు , పోలీసు సిబ్బంది చూశారు . పరీక్షలలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్ రెడ్డి , వెస్ట్ జోన్ డీసీపీ . శ్రీనివాస్ రెడ్డి , ఏసీపీలు , ఇన్ స్పెక్టర్లు , ఆర్ఐలు , సబ్ ఇన్ స్పెక్టర్లు ఆర్ఎస్సైలు పరిపాలన విభాగం అధికారులు , ఐటీ కోర్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు .