వరంగల్ / జనగామ జిల్లాల్లో గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో గాలి, వర్షానికి షెడ్డు కూలి మాణిక్యాపూర్ గ్రామంలో కమలమ్మ(60) గోడకూలి మృతి చెందింది. జనగామ జిల్లా లింగాల ఘనాపూర్ మండలం పాటిల్‌గూడాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పిడుగుపాటుతో గ్రామానికి చెందిన యువకుడు పోనాల శ్రీనివాస్(37) మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు శవానికి పంచనామా నిర్వహించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని అధికారులు బాధిత కుటుంబానికి హామి ఇచ్చారు.