{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581561982760","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581561960635","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో ఏడుగురికి జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ వరంగల్‌ న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. హన్మకొండ ట్రాఫిక్‌ సీఐ ఎమ్డీ హన్నన్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ ఈదులవాగు, కేయూ జంక్షన్‌, గోపాలపురం, పెద్దమ్మగడ్డ బ్రిడ్జి, ములుగురోడ్డు వద్ద ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా హన్మకొండ గుండ్లసింగారానికి చెందిన మురళి, హనుమాన్‌నగర్‌కు చెందిన ములుగూరి సమ్మయ్య, కాశిబుగ్గకు చెందిన గురుదేవ్‌సింగ్‌, పైడిపెల్లికి చెందిన లావుడ్య రవి, పెగడపెల్లికి చెందిన సుంకరి శ్రీనివాస్‌లు మంగళవారం రాత్రి మద్యం సేవించి పట్టుబడ్డారు.

Advertisement

బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించి మద్యం సేవించినట్టు గుర్తించారు. వీరిని బుధవారం కోర్టుకు తరలించగా జిల్లా న్యాయస్థాయం సెకండ్‌క్లాస్‌ మెజిస్ర్టేట్‌ ఎ.వెంకటేశం ఐదుగురికి తలా రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. అలాగే డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ మరో ముగ్గురికి రూ.4700 జరిమానా విధించారు. వీరిని కోర్టు నుంచి హన్మకొండ ట్రాఫిక్‌ కోర్టు కానిస్టేబుల్‌ ఏరుకొండ సుధాకర్‌ వరంగల్‌ సెంట్రల్‌ జైలు అధికారులకు అప్పగించారు.

మట్టెవాడ: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ సెకండ్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వెంకటేశం తీర్పు ఇచ్చినట్లు వరంగల్‌ ట్రాఫిక్‌ సీఐ స్వామి తెలిపారు. డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీల్లో వరంగల్‌ ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన బోదస్‌ సాయి కిరణ్‌, గట్ల కనపర్తికి చెందిన బొంకూరి కిరణ్‌లు ట్రాఫిక్‌ సీఐ స్వామి, ఎస్సై యాదగిరికి పట్టుబడ్డారు. కోర్టు సాయికిరణ్‌కు రెండు రోజుల జైలుశిక్ష, కిరణ్‌కు ఒక్కరోజు జైలుశిక్షను విధించింది. వీరితోపాటు మరో ఐదుగురికి రూ10,400లు జరినామా విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ తెలిపారు