ఈ నెల 27న మేయర్ ఎన్నిక నేపద్యంలో ఎన్నిక పరిశీలకులుగా వచ్చిన టీ.ఎస్.ఐ.ఐ.ఎస్ చైర్మన్ గ్యాదరీ బాలమల్లు గారు గ్రేటర్ పరిదిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజి ఎంపి పసునూరి దయాకర్, రాష్ట్ర చైర్మన్లు వాసుదేవరెడ్డి, రాజయ్య యాదవ్ పాల్గొన్నారు.

వరంగల్ తూర్పుకే కేటాయించాలి:

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీ.ఎస్.ఐ.ఐ.సి చైర్మన్, మేయర్ ఎన్నికల పరిశీలకులు గ్యాదరి బాలమల్లుకు విన్నవించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పోరేటర్లు…

వరంగల్ మేయర్ గా ఉన్న నన్నపునేని నరేందర్ తూర్పు ఎమ్మెల్యే గా పోటీ చేసి విజయం సాదించారు. దీంతో తన రాజీనామాతో కాలీ అయిన మేయర్ స్థానానికి ఈనెల 27న ఎన్నిక జరగనున్న నెపద్యంలో ఎన్నిక పరిశీలకుడుగా, ఏకాబిప్రాయ సేకరణ కోసం టీఎస్.ఐ.ఐ.ఎస్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు. ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని హోటల్ గ్రాండ్ గాయత్రీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పోరేటర్లతో సమావేశానికి గ్యాదరి బాలమల్లు హాజరయ్యారు.. ఈ సందర్బంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికే మేయర్ పదవి కేటాయించాలని ఎమ్మెల్యే నరేందర్, కార్పోరేటర్లు బాలమల్లు గారికి విన్నవించారు. ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గం పేదరికం ఎక్కువ అని, అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందని అందుకు మేయర్ పదవిని ఈ నియోజకవర్గానికి చెందిన వారికి ఇవ్వాలని కోరారు.నియోజకవర్గ అభివృద్దే మా ఎజెండా అని ఇదివరకు మేయర్ పదవి ఈ నియోజకవర్గం నుండే ఉన్నందున తిరిగి ఈ నియోజకవర్గానికే కేటాయించాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు.