{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582872152145","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582872152100","source":"other","origin":"gallery"}

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం విక్రయించి రెండు నెలలకు పైగా అయిన నేటికి ధాన్యం పైసలు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం మండలంలో గిరిజన సహకార సంస్థ రూ. కోటి 25 లక్షలు, సహకార సంఘం కోటి పది లక్షలు, ఐకేపీ 40లక్షలు, మరికొన్ని సంస్థలు సుమారు అన్ని సంస్థలు కలిపి ఆరు వందలకు పైగా రైతులకు ధాన్యం డబ్బులు రావాల్సి ఉంది. ప్రతి రోజు సంబంధిత కార్యాలయాలకు, బ్యాంకు వెళ్లి అకౌంట్లను తనిఖీలు చేస్తున్నారు. అయిన కానీ డబ్బులు పడకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని మండల రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ములుగు కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు రావాల్సిన డబ్బులను వెంటనే అకౌంట్లలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మండల రైతాంగం కోరుతుంది.