నగరంలో ఇస్మార్ట్ శంకర్  సినిమా టీం సందడి చేసింది. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి దర్శక నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మి, హీరోయిన్ నిధి అగర్వాల్, హాజరయ్యారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఊహించని విజయాన్ని అందించిందని, తెలుగు రాష్ట్రాల్లో బంపర్ విజయం సాధించి మాలో మంచి జోష్ నింపిందన్నారు. హీరో రామ్ లో ఉన్న విభిన్న లక్షణాలను వాడుకొని వైవిధ్యమైన కథతో తెరకెక్కించామని, ఈ చిత్రాన్ని ప్రజలు ఆదరించి ఇంత పెద్ద విజయాన్ని అంధించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలినారు.