• మైనర్ బాలికపై అత్యాచారం , ఆలస్యంగా వెలుగులోకి .
  • అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు
  • ఆపారని రాజకీయ నాయకుల పైరవీలు నిరసనలు , ర్యాలీలతో దద్దరిల్లిన నగరం
  • నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్.
  • కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించిన పోలీసులు

వరంగల్ నగరంలో మానవత్వం మంటకలిసింది . ఏడేళ్ల మైనర్ బాలికపై 28 సంవత్సరాల యువకుడు కామంతో కళ్లు మూసుకపోయిన యువకుడు అత్యాచారం చేసిన సంఘటన మానవత్వం గల ప్రతి ఒక్కరి మనస్పును కలిసివేసింది . ఈ విషయంపై వారం రోజులపాటు జరుగుతున్నా, స్థానిక పోలీసులు నిందితుడిపై ఎలాంటిచర్యలు తీసుకోకుండా, స్థానిక అధికార పార్టీ నాయకుడి ముఖ్యనాయకుల ఆదేశాల మేరకు కాలయాపన చేశారు . చిన్న చిన్న నేరాలకు ప్రాథమిక విచారణ నిర్వహించకుండానే FIR నమోదు చేసి నిందితులకు చిత్రహింసలకు గురిచేసే పోలీసులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటిచర్యలు తీసుకోకుండా కాలయపాన చేయడం బాధితురాలి బందువులు , శ్రేయోభిలాషుల ఆగ్రహానికి కారణమైంది . స్థానిక పోలీస్ అధికారులు రాజకీయనాయకుల అండదండలతో అధికార దుర్వినీయోగానికి పాల్పడటమే కాకుండా కాసులకు కక్కుర్తిపడి కాలయాపన చేసి సమస్య సద్దుమనిగేలా చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేసిన సంఘటన నగరంలో చర్చనీయాంశమైంది .

మైనర్ బాలికపై చేసిన అత్యాచారానికి స్థానిక ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు ఆశ్చార్యానికి గురయ్యారు . ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు సైతం బాధితురాలికి ఎలాంటి సహాయం అందించలేకపోయారు . ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకు విఘాతమవుతుందని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని బాధితురాలి బందువులు ఆరోపిస్తున్నారు . ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బాధితుడిపై చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని బందువులు కోరుతున్నారు .