వరంగల్ నగరానికి జాతీయ అగ్ర నేతల తాకిడి . బీజేపీ పరకాల అభ్యర్థి విజయ్ చందర్ రెడ్డి ఇలాకాలో అమిత్ షా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి జాతీయ నేతల తాకిడి పెరిగింది. ఇటీవలే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మేడ్చల్ సభకు హాజరయ్యారు. ప్రజాకూటమి ప్రచారానికి ఊపునితీసుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఆ పార్టీ జాతీయాద్యక్షుడు అమిత్ షా ఆదివారం వరంగల్ పరకాల సభకు హాజరయ్యారు.
టీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ప్రయత్నాలని తప్పుపట్టారు. రిజర్వేషన్లు 51 శాతానికి మించొద్దని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఎవరి రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు కేసీఆర్‌ రిజర్వేషన్లు కల్పిస్తారని షా ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడిందన్నారు. కొడుకు, కూతుళ్లను గెలిపించుకోవడానికే ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు,
మోడీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఏడు రెట్లు అధికంగా నిధులిచ్చాం. బీసీ కమిషన్‌కు మోడీ చట్టబద్ధత కల్పించామన్నారు. బీజేపీ ఓ అవకాశం ఇవ్వండి. తెలంగాణని అభివృద్ధి చేసి చూపుతాం అన్నారు షా

సురేఖ రౌడీయిజం

పరకాల అభ్యర్థి పెసర విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ, 2012 వరకు డాక్టర్ వృత్తిలో ఉన్న నేను నెలకు లక్ష రూపాయల వేతనం, ఇవన్నిటిని వదిలి తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నానని, పరకాల ప్రజల దాహార్తిని చూసి చలించి పోయానని, ఇంతవరకు ఇక్కడ ఎంఎల్ఏ గా ఉన్న నాయకులు అభివృద్ధి చేయలేదని వాళ్ళ వాగ్దానాలన్నీ మరచిపోయారని, వంద పడకల ఆసుపత్రి, ఇంటింటికీ నల్లా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమీ లేవని, ఒకరు రౌడీయిజం, మరోక్కకు ఏజంట్ లా మారిపోయరన్నారు. ఈసారి ప్రజలు తనను గెలిపించాలని కోరారు.