సమష్టి కృషితో వరంగల్ అర్బన్ జిల్లాను అన్ని రంగాల్లో టాప్ లో నిలుపుదామని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అన్నారు . 70వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం జాతీయపతా కాన్ని ఆవిష్కరించారు . అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . ప్రభుత్వ గురుకుల పాఠశాలతో పాటు మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన మానసిక వికలాంగులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అబ్బురపరిచాయి . ఆయా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు కలెక్టర్ అవార్డులు అందించారు .

అనంతరం కలెక్టర్ కారు ప్రసంగించారు .

వరంగల్ అర్బన్ జిల్లా సమగ్రాభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు . నగరం చుట్టూ 70 కిలో మీటర్ల నేషనల్ హైవేను అనుసంధానం చేస్తూ రూ . 650 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు సీఎం శంకుస్తాపన చేశార్వహించారన్నారు . నగర అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ , హృదయ్ , స్మార్ట్ సిటీ పథ కాలను ప్రవేశపెట్టిందన్నారు . నగరంలో రోడ్ల విస్తరణ , 13 జంక్షన్ల ఆధునీకరణ , మున్సిపల్ పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశామన్నారు . రైతు బంధు పథకం ద్వారా ఈ ఖరీఫ్లో . 68 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందజేశామన్నారు .

సంక్షేమం . .

కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ పథకం కింద 576 మంది ఎస్సీలకు , 67 మంది ఎస్టీల కు , 2,010 మంది బీసీలకు 484 మంది మైనారిటీలకు మొత్తం 3137 లబ్దిదారులకు . 23 54 ,54 560 పెళ్లి కానుకలుగా ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు కంటివెలుగు కార్యక్రమం ద్వారా లక్షల 70వేల మందికి కంటి పరీక్షలు ని చేశార్వహించి లక్షా వేల మందికి కంటిఅద్దాలు అందించామన్నారు . ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణులు బాలింతలు , పిల్లలకు సంపూర్ణ భోజనం అందించామన్నారు . యాదవులకు గొర్రెల యూనిట్ల పంపిణీ , మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు .