వరంగల్ పట్టణంలో పలు ప్రాంతాల్లో రేపు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమీషనర్ విశ్వనాథ్ రవీందర్ ప్రకటించింది. నగరంలో పలు పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 4 పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

పోలీసులకు కొత్త వాహనాలు.

వరంగల్ కమిషరేట్ పరిధిలోని పోలీసుల కోసం కొత్త వాహనాలు వచ్చాయి. ఈ కమిషనరేట్ కు ప్రభుత్వం కొత్త వాహనాలను కేటాయించింది. నాలుగు కొత్త ఇన్నోవా కార్లు శుక్రవారం చేరుకున్నాయి. ఇటీవలే 352 ద్విచక్ర వాహనాలు కమిషనరేట్ కు వచ్చాయి. వాటికి పోలీస్ స్టిక్కరింగ్ కూడా పూర్తయింది. ఉన్నతాధికారుల అనుమతి రాగానే వీటిని పోలీస్ సిబ్బందికి అందజేస్తారు.