పట్టణ ప్రగతి పేరుతో మాయ మాటలు చెప్పి మరోసారి ప్రజలను మోసం చేయటానికి వస్తున్న టిఆర్ఎస్ నాయకులను నిలదీయాలని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ:

మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను మోసం చేయటానికి మరోసారి పట్టణ ప్రగతి పేరుతో ప్రజల్లోకి వెళ్లి మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ధ్వజ మెత్తారు. 2018 వరకే మిషన్ భగీరథ కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టండని చెప్పిన మీరు ఏ మొఖం పెట్టుకొని ఏం సాధించామని పట్టణ ప్రగతిలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఏ ఒక్కరికైనా ఇచ్చారా ? ఒక్కరికైనా ఇచ్చినట్టు చూపించండని సవాల్ విసిరారు. కొన్ని కట్టి చూపించి వాటిని దళారులతో పేదవారి దగ్గర డబ్బులు దొబ్బుతున్నారని ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.