ములుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లోని వ్యాపారాలు పది రూపాయల నాణేలు చెల్లవంటూ తీసుకోవడం లేదు. బ్యాంకులు మాత్రం ఖాతాదారులకు ఆ నాణేలను అంటగడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కానీ అవే బిల్లలను తీసుకోవదానికి బ్యాంకుల అధికారులు ససేమిరా అంటున్నారు. ఏటూరునాగారం లోని SBI లో మేనేజర్, పది రూపాయల బిళ్లను తీసుకోవడం లేదు. దీంతో ఆ బిల్లలు ఉన్న ప్రజలు వాటిని మార్చుకోవడానికి పడరానిపాట్లు పడుతున్నారు. బ్యాంకులే తీసుకొనప్పుడు మేము కూడా తీసుకోమని వ్యాపారులు షాపుల ముందు బోర్డులు తగిలించారు…