తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సంస్కృతికి సంబంధించిన పండుగలను ఎంతో అట్టహాసంగా జరుపుతున్నామని తెలుపుతున్న , తెలంగాణ ప్రజల బ్రతుకుతెరువు కోసం హైదరాబాదులో జీవిస్తున్నరు, ముఖ్యమైన పండుగలు ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా పండగకు వారి గ్రామాలకు వెళ్లందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో ఆర్థికంగా వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ప్రత్యేకంగా సంక్రాంతి, దసరా పండగ లకు హైదరాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ఆంధ్ర ప్రాంతానికి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ నగరాలకు ప్రత్యేక జెన్ శారదాన్ తక్కువ చార్జీలు వసూలు చేసే రైల్వే,

తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వలన కాజీపేట, వరంగల్ నుంచి ప్రయాణించే ప్రయాణికులు సిర్పూర్ కాగజ్నగర్ , పెద్దపల్లి, రామగుండం మహబూబాద్, కొత్తగూడెం, మణుగూరు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఈ ప్రత్యేకత రైలు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నడుపుతున్నారు. రైల్వే తెలంగాణలోని జనగాం, మహబూబాబాద్ లలో రైళ్ల ను ఆపకపోవడంతో పండుగకు వచ్చే ప్రయాణికులకు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఇది ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ తర్వాత చిన్నచిన్న స్టేషన్ లో కూడా అపుతున్నారని ప్రయాణికులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణీకులు రిజర్వేషన్ రైల్లో ముందే ఆంధ్ర ప్రాంత ప్రయాణికులతో నిండిపోవడంతో ప్రతి రైలుకు ఉండే రెండు జనరల్ కోచ్లను నిండిపోయి ప్రయాణం చేయుటకు వీలు కాకుండా పోతుంది అని అంటున్నారు