వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌ ఆర్బన్‌ రూరల్‌ జిల్లాలతో పాటు జనగామ జిల్లాలో గణేష్‌ నవరాత్రులు నిర్వహిస్తున్న గణేష్‌ మండపాలపై పోలీసుల నిఘా కోనసాగుతోందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమయిన గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్‌ మండపాలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లోను ఎలాంటి ఆవాంచనీయ సంఘటన జరగకుండా ముందస్తూ కార్యచరణ ప్రణాళికతో పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపాలకు పోలీస్‌ భద్రత కల్పించడం జరుగుతోందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 6,182 గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 2,645, వెస్ట్‌జోన్‌ పరిధిలో 1808, ఈస్ట్‌ జోన్‌ పరిధిలో 1729 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహాలకు భద్రత కల్పించడం కోసం ప్యూహత్మకమైన చర్యలు చేపట్టడం జరుగుతోంది.

ప్రతి గణేష్‌ విగ్రహాన్ని జియో ట్యాగింగ్‌కు అనుసంధానం

పోలీసులు గణేష్‌ మండపాలకు కల్పించడంలో భాగంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతి గణేష్‌ విగ్రహాన్ని జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడం జరుగుతోంది. ఇందుకోసం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సెక్టార్లా వారి పెట్రోలింగ్‌ నిర్వహించే బ్లూకోర్ట్స్‌ సిబ్బంది తమ సెక్టార్‌ పరిధిలోని గణేష్‌ నవరాత్రులు నిర్వహించే గణపతి మండపాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి వారి వద్దవున్న ట్యాబ్‌ల ద్వారా సంబంధిత గణేష్‌ మండపాల చిత్రాలను తీసుకోవడంతో పాటు, మండపాల నిర్వహకులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించి పోలీస్‌ వెబ్‌ ఆప్లికేషన్‌ ద్వారా క్షేత్ర స్థాయిలో జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 4651 గణేష్‌ విగ్రహాలను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్‌ జోన్‌ 1970, వెస్ట్‌జోన్‌ 1242, ఈస్ట్‌జోన్‌ పరిధిలో 1439 విగ్రాలను జియో ట్యాగింగ్‌ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జియో ట్యాగింగ్‌ చేయడం ద్వారా పోలీస్‌ స్టేషన్ల వారిగా స్టేషన్‌ అధికారులు, సిబ్బందికి విగ్రహాల సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో వుండటంతో పాటు, గణేష్‌ మండపాల వద్ద ఎదైనా సమస్య తలేత్తినప్పుడు సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు త్వరితగతిన చేరుకునేందుకు అవసరమైన మార్గాలను గుర్తించడం సులభం ఆవుతుంది.

24గంటలు బ్లూకోర్ట్స్‌ సిబ్బంది పర్యవేక్షణ

ఏర్పాటు చేసిన గణేష్‌ మండళ్లకు కల్పిస్తూన్న భద్రతలో భాగంగా సేక్టార్‌ వారిగా విధులు నిర్వహించే బ్లూకోర్ట్స్‌ మరియు పెట్రో కార్‌ సిబ్బంది ప్రతి రోజు షిఫ్ట్‌ల వారిగా మూడు పర్యాలు మండపాలను సందర్శించి అక్కడి స్థితిగతులపై అధ్యయనం చేస్తూ భద్రత విషయంలో నిర్వాహకులకు సూచనలు చేస్తూ, మండపాల వారిగా జారీచేసిన బీట్‌బుక్‌లో సేక్టార్‌ పోలీస్‌ సిబ్బంది సంతకం చేయడం జరుగుతుంది. లాగానే సంబంధిత నిర్వహకుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది.

అన్‌లైన్‌ ద్వారా గణేష్‌ మండపాల రిజిస్ట్రేషన్‌

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే దిశగా విగ్రహాల ఏర్పాటుకు అవసరమయిన పోలీస్‌ అనుమతులకై నవరాత్రి నిర్వహకులు సంబంధితి పోలీస్‌ స్టేషన్‌ వెళ్ళకుండా తోలిసారిగా ఆన్‌లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న గణేష్‌ నవరాత్రి నిర్వహకులకు విగ్రహ ఏర్పాటుకు స్థానిక పోలీసులు అనుమతులను మంజూరు చేయడం జరిగిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.