వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న 133 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ తోలగించినట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం ప్రకటించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన వున్నవారిపై రౌడీ షీట్ల తోలగించపు మేళా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించారు. ఈ మేళాలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లనందు 783 మందిపై రౌడీ షీట్లను మరోసారి పరిసిలించారు.

Advertisement

ఇందులో ప్రశాంవంతమైన జీవితంతో పాటు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలలో పాల్గోనకుండా సాధరణ జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లను గుర్తించి వారిపై రౌడీ షీట్‌ తోలగించేందుకు గాను తొలిసారి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రౌడీషీట్ల తోలగింపు మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం సెంట్రల్‌, వెస్ట్‌, ఈస్ట్‌ జోన్ల పరిధిలోని రౌడీషీటర్ల ప్రస్తుత జీవనవిధానంపై సంబంధిత స్టేషన్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో సమీక్షా జరిపి రౌడీషీట్‌ తోలగింపు జాబితాను రూపోందించడం జరిగింది. ఈ జాబితాను అనుసరించి సత్ప్రవర్తన కలిగిన వారిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రౌడీ షీట్‌ తోలగింపు మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేళాకు ముఖ్య అతిధిగా హజరయిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రౌడీ షీట్‌ తోలగించిన రౌడీషీటర్ల మాట్లాడుతూ శాంతిభద్రతలు విఘాతం కల్పించడంతో పాటు పదే, పదే నేరాలకు పాల్పడంతో పాటు నేరాలకు పాల్పడానికి పురికోల్పుతారో వారిపై రౌడీషీట్‌ తెరవడం జరుగుతుంది. ఇలా రౌడీషీటర్‌గా గుర్తింపబడిన వ్యక్తులపై పోలీసుల నిఘా కోనసాగుతుందని తెలిపారు.

కాని గత కోద్దికాలంగా రౌడీషీటర్లుగా గుర్తింపబడిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవితాన్ని కోనసాగిస్తూ ఎలాంటి నేరాలకు పాల్పడకపోవడాన్ని గుర్తించడం జరిగింది. అలాంటి వారిపై రౌడీషీట్‌ తోలగింపుకై ఏ.సి.పి స్థాయిలో అధికారులు గత నెలరోజుల నుండి రౌడీషీట్‌ తోలగింపు ప్రక్రియ నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా సత్ప్రవర్తన కలిగిన వారిపై షీట్‌ తోలగింపుతో పాటు, చట్యవ్యతిరేఖ కార్యకలపాలకు పాల్పడేవారిపై రౌడీషీట్‌ తెరవడం కూడా జరుగుతుందని తెలిపారు. గత సంవత్సర కాలం నుండి ఇప్పటి వరకు 28మందిపై కోత్తగా రౌడీషీట్‌ను తెరవడం జరిగిందని వెల్లడించారు. రౌడీషీట్‌ తోలగించబడిన వ్యక్తులు భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఎదైనా ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించే భాధ్యాతయుతమైన పౌరులుగా వుంటూ పోలీసులకు సహకరరించాలని ఆదేశించారు.