ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక*
ప్రస్తుతము గవర్నమెంటు ప్రవేశ పెట్టిన ఆన్ లైన్ విదానాన్ని కొన్ని ముఠాలు ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ముంబాయి, ఉత్తరప్రదేశ్ మరి కొన్ని రాష్టాలకు చెందిన కొంత మంది వ్యక్తులు బ్యాంకు మేనేజర్ అని, బ్యాంకు అధికారుల మని ఫోన్ కాల్ చేస్తూ నమ్మించి , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. మీయొక్క ఎటిఎం నెంబర్, ఓ టి పి నెంబర్ , పాన్ , ఆదార్ కార్డు వంటి వివరాలను చెప్పమని, బ్యాంక్ ఏ.టి.ఎం కార్డుని అప్ డేట్ చేస్తున్నామని అడిగి మీ అకౌంట్ లో ఉన్న డబ్బులని ఆన్ లైన్ ద్వార కొన్ని క్షణాల్లో మాయం చేస్తున్నారు.
కావున మీకు బ్యాంకు మేనేజర్ అని ఎవరైనా ఫోన్ చేసి మీ అకౌంట్ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితి కూడ దయచేసి చెప్పకండి.
ఏ బ్యాంక్ మేనేజర్ మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ వివరాలు ఎట్టి పరిస్థితిలోను అడగరు . ఆ విషయం మీరు గమనించగలరు.
మీతో మాట్లాడే వ్యక్తి ఇంగ్లీషు, హిందీలో మాట్లాడుతూ మీ వివరాలు అడుగుతూ వుంటారు. కావున వెంటనే అలర్ట్ అయ్యి అనుమానించగలరు.
మిమ్మల్ని ఎవరైనా ఫోన్ కాల్ చేసి వివరాలు అడిగితే, మీరు బ్యాంకుకి వచ్చి వివరాలు చెబుతామని చెప్పండి.
ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు- అపరిచిత వ్యక్తుల పేరు పై వివిధ బ్యాంకు ల యందు పేక్ ఐడి ఫ్రూప్ తో అకౌంట్ తెరచి , ఎ.టి.ఎం కార్డు పొంది ఆన్ లైన్ నుండి మీ డబ్బులు క్షణాల్లో విత్ డ్రా చేస్తున్నారు.
ఒకవేళ మీరు ఎలాంటి వివరాలు తెలుపకుండా మీ అకౌంట్ నుండి అమౌంట్ వితడ్రా అయితే అది ఇంటర్నేషనల్ ట్రాన్సెక్షన్ అయ్యి ఉంటుంది, కాబట్టి అట్టి డబ్బులకు ఆర్.బి.ఐ బాధ్యత వహిస్తుంది. ఆర్.బి.ఐ గైడ్లలయిన్స్ ప్రకారము, మీ వివరాలు గుర్తించి తిరిగి మీ బ్యాంకు అకౌంట్ యందు డిపాజిట్ అవ్వడానికి అవకాశం ముంది.
ఈలాంటి సైబర్ నేరస్తుల నుండి అప్రమత్తంగా ఉంటూ- మీరు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా కాపాడుకోండి.,
సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అన్ని రకాల అలర్ట్ చేసిన 70% మంది ఉద్యోగస్తులు, చదువుకున్న వారే సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు .
ఇలాంటి ఫేక్ ఐడితో, కొత్త టెక్నాలజి తో సైబర్ క్రైమ్ చేసే వ్యక్తులను గుర్తించడము ఇబ్బందిగా ఉంటుంది.
(దయచేసి ఈ మెసేజ్ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి.)
కృతజ్ఞతలతో., మీయొక్క …
VISHWESWAR
Inspector Cyber Crime
Warangal Police commissionerate.
