వరంగల్ బీజేపీలో లొల్లి

బీజేపీ ప్రకటించిన రెండో జాబితాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ అశించిన వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పేరు లేకపోవడంతో అమె అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. టికెట్ అశించి భంగపడిన రావు పద్మ ఏకంగా టికెట్ దక్కించుకున్న మార్తినేని ధర్మారావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరు సార్లు ఓడిపోయిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారు. పార్టీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటానని అన్నారు. పెద్ద అనుచరగణంతో అమె హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో కాంగ్రెస్ కల్చర్ వచ్చిందని సీనియర్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పార్టీలో కొంత మంది టికెట్‌లు అమ్ముకుంటున్నారని అరోపిస్తున్నారు.

అధిష్టానం దిగిరాక పోతే తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అంటున్నారు.