వరంగల్: బీజేపీ ఆకర్ష్ కు లొంగొద్దు- సొంత నేతలను బుజ్జగింస్తూన్న తెరాస..

పోరుగడ్డ  ఓరుగల్లులో పార్టీ బలోపేతానికి కమలదళం పావులు కదుపుతోంది. ప్రజా క్షేత్రంలో మంచి పట్టున్న నాయకులను తమవైపు  తిప్పుకునేందుకు  ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ.  కాంగ్రెస్, టీడీపీ తో  పాటు  టీఆర్ఎస్ అసంతృప్త  నేతలపై  కూడా  బీజేపీ దృష్టి సారించింది.  ఇప్పటికే  మాజీ ఎమ్మెల్యే,  కాంగ్రెస్ నేత కొండేటి శ్రీధర్  బీజేపీలో  చేరగా మరికొంత  మంది  త్వరలోనే  కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించారు బీజేపీ నేతలు. ఈ జిల్లాల్లోని కాంగ్రెస్ , టీడీపీ నాయకులు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయంటున్నారు కమలం నేతలు.

ఈ నెల 18న హైదరాబాద్ లో జరిగే సభకు  అమిత్  షా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు పార్టీలో చేరతారంటున్నారు వరంగల్  అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. టీఆర్ఎస్ నుంచి కూడా చేరికలుంటాయంటున్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అనుకుంతంగా అభివృద్ధి జరగడం లేదన్నారు. టీఆర్ఎస్ కు  ప్రత్యామ్నాయం బీజేపీనే అంటున్నారు.అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీలో చేరకుండా టీఆర్ఎస్ బుజ్జగింస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here