వరంగల్: దంపతులు బైక్‌పై వెళ్తుండగా మర్గమధ్యలో వానరం అడ్డువచ్చింది. దీంతో సడన్‌ బ్రేక్‌ వేయగా భార్య బైక్‌ నుంచి పడి తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గార్ల మండలం కొత్తపోచారం గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యురాలు తిప్పారపు రూతమ్మ భర్త హనుమంతరావుతో కలిసి బైక్‌పై శుక్రవారం గార్ల కు వచ్చారు. అనంతరం స్వగ్రామం వెళ్తుండగా గోపాలపురం సమీపంలో బైక్‌కు కోతి అడ్డొచ్చింది. దీంతో హనుమంతరావు సడన్‌ బ్రేక్‌ వేయగా వెనుక కూర్చున్న రూతమ్మ రో డ్డుపై పడింది.

తల వెనుక భాగంలో తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కో మాలోకి వెళ్లింది. క్షతగా త్రురాలిని హుటాహుటినా 108 ద్వారా ఖమ్మం తరలిచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, తమది నిరుపేద కుటుంబమని, కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బు లేదని, దాతలు స్పందించి తన భార్యకు ప్రాణభిక్ష పెట్టాలని హనుమంతరావు వేడుకుంటున్నాడు. దాతలు 9573073641 నంబర్‌కు ఫోన్‌ పే చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.