{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578472203214","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578472052611","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మంత్రి కేటీఆర్‌ను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నారు

వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రి.. రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా వార్తల్లో నిలుస్తున్న కేటీఆర్ కు అనుహ్యమైన అనుభవం ఎదురైంది. నిట్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన, అనంతరం మేడికొండలో ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీల వద్దకు వెళ్లేందుకు రెఢీ అయ్యారు. బయటకు వచ్చిన ఆయన తనకు కేటాయించిన కారులో కాకుండా ప్రముఖ ఐటీ సంస్థల అధినేత బీవీ మోహన్ రెడ్డి కి చెందిన బెంజ్ కారును చూశారు.

వెంటనే ఆ కారు డ్రైవర్ సీటు లో కూర్చున్నారు. తన కాన్వాయ్ లోని ఇతర వాహనాలతో సమానంగా బెంజ్ కారును నడుపుతున్న మంత్రి కి ఊహించని అనుభవం ఎదురైంది. మంత్రిగారి కాన్వాయ్ లో ఆయన వాహనం కాకుండా మరో వాహనం కనిపించటంతో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే రంగంలోకి దిగి కేటీఆర్ డ్రైవ్ చేస్తున్న కారును నిలిపి వేశారు. మంత్రి కారును ఆపేసిన కానిస్టేబుల్ తీరు తో ఒక్కసారి కలకలం రేగింది. మంత్రి కేటీఆర్ నడుపుతున్న కారును కానిస్టేబుల్ ఆపేయటం తో భద్రతా సిబ్బంది ఉలిక్కి పడ్డారు. తాను ఆపిన కారును నడుపుతున్నది కేటీఆర్ అన్న విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ నాలుకర్చుకొని వాహనాన్ని పంపారు. ఈ ఉదంతం ఆసక్తి కరంగా మారింది.