పబ్‌ జి గేమ్‌ మరో యువకుడ్ని బలితీసుకుంది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌లో 22 ఏళ్ల రావుల సాయి అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సాయి గత కొద్ది రోజులుగా పబ్‌ జి గేమ్‌కి అలవాటు పడి బానిసగా మారాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ గేమ్‌ నుంచి బయటకు రాలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. ఇక తాను ఎవరికీ కనిపించను అంటు రాత్రి ఫ్రెండ్స్‌కు మెసేజ్‌ పెట్టిన సాయి.. ఉదయం చూసేసరికి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతుడ్ని రాఘవపూర్‌ వీఆర్‌ఏగా గుర్తించారు.