మంగపేట మండలంలోని మల్లూరులో కొలువు దీరిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ది గాంచింది . మల్లూరు గుట్టపై వెలిసిన హేమాచల క్షేత్రానికి వచ్చే భక్తు లతో పాటు పర్యాటకంగా వచ్చే వారిని ఎంత గానో ఆకట్టుకుంటోంది . ఆలయ సమీపంలో సహజసిద్ధంగా వెలసిన చింతామణి జలపాతం సంవత్సరం పొడవునా హెచ్చు తగ్గులు లేకుండా పారుతూ ఉంటుంది . దేశంలో ఎక్కడా లేని విధంగా 9.4 అడుగులతో స్వయంబువగా హేమాచలుడు వెలసినట్లు ప్రతీతి. నువ్వుల నూనెతో ప్రతి శని , ఆది , సోమ వారాల్లో తిలతై లాబిషేకం పూజలు నిర్వహించి నూతన పట్టు వస్తాలతో అలంకరించడం ఇక్కడి ప్రత్యేకత .
చింతామణి జలపాతం వద్ద స్నానమాచరించి స్వామివారికి తిలతైలాభిషేక పూజలు చేసి స్వామివారి నాభిచందనాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం . ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసేందుకు 18వ శతాబ్దంలో అప్పటి ఎస్టేట్ జమీందార్ రాజామొదలియార్ ఎద్దుముక్కు అనే ప్రాంతంలో సౌకార్యలు కల్పించారు . ఎద్దు ముక్కు ఆకారంలో ఉన్న రాయి నుంచి నీరు దారగా రావడం ఇక్కడి ప్రత్యేకత . మల్లూరుగుట్ట చుట్టు సుమారు 20 కి . మీ విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో శాతవాహన కాలంనాటి పూర్వికులు నివసించిన ఆనవాళ్లు దర్శన మిస్తాయి