వరంగల్ మహాకూటమి లో టిక్కెట్ల గొడవ . నాయిని రాజేందర్ కె టికెట్ ఇవ్వాలి అని డిమాండ్

మహా కూటమిలోపొత్తులో భాగంగా వరంగల్ పశ్చిమ టికెట్ టి.డి.పికి ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారికి టికెట్ కేటాయించాలని కోరుతూ ఈ రోజు హన్మకొండ సర్క్యూయిట్ గెస్ట్ హౌస్ రోడ్ లో ఉన్న విశాల్ భవన్ ఎదుట పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు ధర్నా చేపట్టారు.

వరంగల్ పశ్చిమ నియూజకవర్గం సీట్ ను ఇతర పార్టీలకు కేటాయిస్తే కార్యకర్తలు అభిమానులు ముఖ్యానంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుండి తీవ్ర నిరసన ఎదురవుతుందని, కావున పశ్చిమ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి కచ్చితంగా టికెట్ ను నాయిని రాజేందర్ రెడ్డి గారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నరు, ఎప్పుడు , ప్రజా సమస్యలను పట్టించుకుని ప్రజా జీవితంలో ఉండుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆఖరికి తన తనయుడు కోల్పోయిన కూడా మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల హామీలను పొందిన నాయిని రాజేందర్ రెడ్డి కి న్యాయం జరగకపోతే వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకు పోతుంది, గత 20 సంవత్సరాలుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజా ప్రతినిధి లేడు.

అయినా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ జీవం పోసిన నాయిని రాజేందర్ రెడ్డి కి టికెట్ ఇవ్వకపోతే ప్రజలను నుండి ఆగ్రహం తప్పదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, NSUI వరంగల్ నే