రుద్రమాంబనగర్ లో గ్రేట్ వరంగల్ కార్పొరేషన్ రహదారి విస్తరణ, రూఫ్ డ్రైనేజి పేర, చింతల్ ప్లైవోవర్ వరకు ప్రహారీలు, గృహాలు, దుకాణాలకు సరైన గడువు, అధికారిక ప్రకటన, నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారు. అసలే వర్షాకాలం కూల్చివేతలు, ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. కూల్చివేతల తదుపరి చేపట్టాల్సిన పనులు పదిహేను రోజులు కావస్తున్నా చేపట్టకపోవడం విచారకరం.పోలీసుల సహాయం తో వర్షము కురుస్తున్న సాయంకాలమున, హడావుడి గా వద్దని వారించినా, వినకుండ నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఇప్పుడైతే తాము ఇండ్లలోనికి వెళ్లడం, ప్రహారీలు లేక, ట్రేడ్ లైసెన్స్ కలిగి దుకాణాలు నడుపుకోలేని పరిస్థితి దాపురించింది. ఈగలు, దోమలు, కప్పలు, ఎలుకలు, పాముల వంటివి నిద్ర లేకుండా చేస్తున్నాయి. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే, కాలనీ వాసుల బాధలు తొలగించాలని బాధిత గృహ నిర్వాసితులు కోరుతున్నారు.