{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582811161270","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582811131044","source":"other","origin":"unknown"}

వెంకటాపురం సిఐ, స్పెషల్ పార్టీ సిబ్బంది తో వెంకటాపురం గ్రామ శివారులో గల కొతపల్లి X రోడ్ వద్ద వాహనాలు చెకింగ్ చేస్తుండగా వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన దార సారయ్య పోలీసులను చూసి భయంతో పారి పోతుండగా వెంబడించి పట్టుకొన్నట్లు సిఐ తెలిపారు. అనంతరం అతనిని విచారించగా అతను కొంత కాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ, ఆ పార్టీ అనుబంధ సంఘాలకు కొరియర్ గా పని చేస్తున్నానని తెలిపినట్లు, మావోయిస్టు దళ సభ్యులకి ఇవ్వటానికి విప్లవ సాహిత్య పుస్తకాలను పాలతీన్ కవరులో తీసుకొని వెళుతుండగా వెంకటాపురం పోలీసులు చూసి అనుమానించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

అదే విధంగా నిషేధిత మావోయిస్టు పార్టీకి కొరియర్ గా పనిచేస్తూ మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన నాయకులను తరచూ కలుస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్తూ.. ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్తిరపరచి ఉద్దేశ్యంతో పని చేస్తున్నాడని తెలిపారు. తనతో పాటు తన అల్లుడు ఐన బూర రంజిత్ (రాజు)ను దళ కమాండర్ దామోదర్ కి కొరియర్ గా పరిచయం చేశాడని, ఇతడిని రిమాండ్ నిమిత్తం గురువారం కోర్ట్ కు పంపడం జరిగిందని తెలిపారు.

తరువాత బూర రంజిత్ (రాజు)ను అతని ఇంటి వద్ద పట్టుకొని పెద్దల సమక్షం లో విచారించగా తన మామయ్య అయిన దార సారయ్య, గాదె కట్టయ్యలతో ఛత్తీస్ ఘడ్ అడవులలో తెలంగాణ స్టేట్ కమిటీ బడే చొక్కారావుని కలుసుకొని అక్కడ యాలం నరేందర్ (సంపత్) దగ్గర బ్లాస్టింగ్ ద్వారా చంపే విధానం నేర్చుకొన్నట్లు తెలిపారు. బూర రంజిత్ ఇంటి వద్ద పోలీసుల పట్టుకోగా దామోదర్ ఇచ్చిన విప్లవ సాహిత్యం, ఒక మెమొరీకార్డు, బ్లాస్టింగ్ కి ఉపయోగించే డిటోనేటర్, ఒక ఎలక్ట్రిక్ డివైస్, స్విచ్ లు గల రెండు కీ చైన్ లు, రెండు సౌండ్ బాక్స్ లు చిన్నవి స్వాధీన పరచుకొన్నట్లు సిఐ తెలిపారు.