అందరికి పేరు పేరున దన్యవాదాలు…

గ్రేటర్ వరంగల్ మేయర్,19 వ డివిజన్ కార్పొరేటర్ పదవి లకు ఈ నెల 24న రాజీనామా చేస్తు లేఖను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనర్ VP. గౌతమ్ కు సమర్పించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ .ఈ రోజు రాజీనామాను కమీషనర్ గౌతమ్ ఆమోదిస్తూ ప్రకటన విడుదల చేసారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగర మేయర్ గా నాకు అవకాశమిచ్చిన కేసీఆర్ గారికి ,నగర అభివృద్దిలో నన్ను బాగస్వామ్యం చేస్తూ నగరాభివృద్దికి విశేష కృషి చేసిన కేటీఆర్ గారికి,మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారికి,సహకరించిన పార్లమెంట్ సభ్యులకు,రాజ్యసభ సభ్యులకు, శాసన సభ్యులకు,కలెక్టర్లు,కమీషనర్లకు,కార్పోరేటర్లకు,అధికారులకు సిబ్బందికి,ఎలక్ర్టానిక్ &ప్రింట్ మీడియా,నగర ప్రజలకు,తనను కార్పోరేటర్ గా గెలిపించి మేయర్ గా అవకాశం వచ్చేందుకు ఆశీర్వదించిన 19వ డివిజన్ ప్రజలకు ఈ సందర్బంగా దన్యవాదాలు తెలిపారు.మేయర్ గా నాకు మంచి గుర్తింపు లభించిందని,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,గుజరాత్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరిచిపోలేని జ్ఞాపకమని,మేయర్ గా వివిద రాష్ట్రాలు పర్యటించానని,ఆ అనుభవాన్ని ఉపయోగించు తూర్పు నియోజకవర్గ అభివృద్దికి కృషిచేస్తానని, నియోజకవర్గానికే పరిమితం కాకుంటా నా విజన్ ను నగర అభివృద్ది లో బాగస్వామ్యం చేస్తూ నగర అభివృద్దికి సహకరిస్తానని తెలిపారు.