వరంగల్ సంస్థకు ఎన్నికలు జరిగినప్పుడు మేయర్ పదవి కోసం చాలామంది కార్పొరేటర్లు పోటీ పడిన విషయం తెలిసిందే జనరల్ అయినప్పటికీ నన్నపనేని నరేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేయడంతో అధిష్టానం మేయర్ పదవి విషయంలో నరేందర్ వైపు మొగ్గు చుపారు . ప్రస్తుతం నరేందర్ ఎమ్మెల్యే గా ఎన్నిక కావడంతో , మరోసారి మేయర్ పీఠం ఉత్కంఠ గా మారింది . తెరాస రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ , మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి గారి కోడలు, గుండు ఆశ్రితారెడ్డిని మేయర్ చేసెందుకు సుధారాణి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ రేసులో సుధారాణి పేరును KCR పరిశీలించిన విషయం తెలిసిందే.

తూర్పు టికెట్ సందర్బంగా తెరాస పార్టీ MLA అభ్యర్థికి గెలుపునకై తమ సహాయ సహకారాలు అందించాలని, ఎమ్మెల్యేగా నరేందర్ గెలిస్తే మేయర్ పదవి సుధారాణి కోడలుకు ఇస్తామని అధినేత కెసిఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.. నరేందర్ MLAగా గెలవడంతో సుధారాణి కోడలికి మేయర్ పదవి దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు … వాస్తవానికి 2016 కార్పొరేషన్ ఎలెక్షన్స్ జరిగినప్పుడు మేయర్ పదవి విద్యావంతురాలు ఆశ్రితరెడ్డికె (గూగుల్ to గ్రేటర్ ) అని రాష్ట్రమంత ప్రచారం జరిగింది . కానీ కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల చేయిజారిపోయిన సంగతి తెలిసిందే. గూగుల్ లో సాఫ్ట్-వెర్ గా పనిచేసిన ఆశ్రితారెడ్డి వరంగల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా గెలుపొందారు .

మొన్నటి వరకు జాన్సీ పేరు వినిపించినప్పటికీ, ప్రస్తుత రాజకీయ సమీకరలా దృష్ట్యా, మేయర్ పదవి ఆశ్రితకె కేటాయిస్తారు అని హైకమాండ్ నుంచి సూచనలు వినిపిస్తున్నాయి, తనకే కేటాయిస్తారు అని జిల్లాలో ప్రచారం జరుగుతుంది …
ఇదిలా ఉండగా మేయర్ పీఠం ఆశించే ఆశావహులు MLAలను ఇప్పటికే కలసి తమ అనుకూలతను తెలపాలని చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ గుండు సుధారాణి శిష్యుడు ఐన విషయం తెలిసిందే . ఇద్దరి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధిష్టానంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న గుండు కుటుంబానికే మేయర్ అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.
ఏది ఏమైనా ఫైనల్ గా మాత్రం యువనేత KTR నిర్ణయం మేరకే మేయర్ ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నందున మేయర్ పోటీలో ఉన్న కార్పొరేటర్లు యువనేతను ప్రసన్నం చేసుకునేందుకు రాజధానికి ఖ్యు కడుతున్నారు..