ప్రేమ వ్యవహారంలో భాగంగా వచ్చిన బెదిరింపులతో ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘంటన వరంగల్ లోని పైడిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది . మృతుడి తల్లితండ్రుల కథనం ప్రకారం .

పైడిపల్లి గ్రామానికి చెందిన గట్టు విక్రం ( 38 ) బీఫార్మసీ పూర్తి చేసి మెడికల్ రిప్ గా ఉద్యోగం చేస్తున్నాడు . ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు . ఇద్దరి మధ్య సానిహిత్యం పెరగడంతో, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో తనకు ఇష్టం లేదని యువకుడు తెలపడంతో ఇది పెద్దల వరకు వెళ్లింది .

ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసిందన్న మనస్తాపంలో విక్రం గురువారం రాత్రి దేశాయిపేట చిన్నవడ్డేపల్లి వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు . సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన విక్రం దేశాయిపేట చెరువు వద్ద ఉన్నాడని , పరుగుల మందు తాగినట్లు ఫోన్లో కుటుంబ సభ్యులకు తెలిపాడు . దీంతో వెంటనే చెరువు వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు విక్రంను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు . పరిస్థితి విషమించడంతో అప్పటికే విక్రం మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో , మృతదేహాన్ని మార్చురీకి తరలించారు .

మృతుని జేబులో సూసైడ్ నోట్ లభించిందని తండ్రి విజయకుమార్ , తల్లి విజయ , తమ్ముడు శరత్ , సోదరి రజితలు తెలిపారు , కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు ప్రేమ వ్యవహారంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు .

బెదిరింపులే కారణమా . . . !

ఈప్రేమ వ్యవహారంలో పైడిపల్లిలోని ఒక అధికార పార్టీ నాయకుడు విక్రంను బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఆరోపణలు గ్రామంలో వెల్లువెత్తుతున్నాయి . మృతుని వద్ద సూసైడ్ నోట్ లో ఇలా ఉంది .