జయశంకర్ భూపాలపల్లి జిల్లా: రాష్ట్రంలోని రుణమాఫీని ప్రభుత్వం వెంటనే అమలు చేసి, రైతులకు తిరిగి పంటరుణాలు అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెన్నంపల్లి పాపయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని అన్నారు. అంతేకాక సుస్థిర పాలనకు బీజేపీ పాటుపడుతోందని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పట్టాపాస్బక్లు రాక ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు పాపయ్య మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వాలకు మంచి ఆదరణ వస్తుందని, నియోజ కవరగంలో 35 వేలకు ఇప్పటికి 17 వేల సభ్య త్వాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ఈనెల 20 వ తేదీ వరకు టార్గెట్ సభ్యత్వాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజునాయక్, రవికు మార్, మధుసూదన్ రెడ్డి, గాలీష్, సురేష్, రామకృష్ణ, రాంరెడ్డి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.