వరంగల్ అర్బన్:

వరంగల్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షో రూమ్ ను ప్రారంభించిన గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మరియు నగర మేయర్ నన్నపనేని నరేందర్ ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ గారు అతిథులుగా హాజరై షోరుము ను ప్రారంభించారు .

కార్యక్రమం లొ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ షోరూంలో నాణ్యత మరియు తక్కువ ధరలతో కూడిన ఆభరణాలు కస్టమర్లకు అందించాలని అదే విధంగా అధిక లాభాలతో షోరూం వరంగల్ నగరంలోనే ముందు వరుసలో ఉండాలని కోరుకున్నారు.

ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమీప బంధువు.. అర్జున్ రెడ్డి సినిమా హిరో దేవరకొండ విజయ్ ఈరోజు హన్మకొండ లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి.. హన్మకొండ రాంనగర్ లోని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసానికి వచ్చారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.