ట్రాఫిక్‌ విభాగంలో పారదర్శకతకై ఈ-ఛాలన్‌ విధానం అమలు :

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ విభాగంలో నిర్వర్తించే విధుల పట్ల ప్రజలకు మరింత పారదర్శకతను కల్పించడం కోసం నూతనంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ -ఛాలన్‌ విధానాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమయిన వరంగల్‌ ట్రై సిటి పరిధిలో ఇక హైద్రబాద్‌ తరహలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించిన వాహనదారులకు ఈ ఛాలన్‌ పద్దతిలో జరిమానాలను విధించడం జరుగుతుంది. గతంలో ట్రాఫిక్‌ అధికారులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లఘించిన వాహనదారుల నుండి ట్రాఫిక్‌ చట్టాలను అనుసరించి జరిమానాలను సదరు ట్రాఫిక్‌ అధికారులు సదరు వాహనదారుడి నుండి ప్రత్యక్షంగా జరిమానా విధించడానికి నేడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ స్వస్తి పలుకుతూ ఈ-ఛాలాన్‌ పద్దతి ప్రారంభించడం జరుగుతుంది.

ఈ-ఛాలన్‌ విధానం అమలు విధానం:

ఈ-ఛాలన్‌ పద్దతిలో భాగంగా నగరంలో వివిధ ట్రాఫిక్‌ జంక్షన్లల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్‌ అధికారులు ఇకపై ట్రాఫిక్‌ నిబంధనలు ఆతిక్రమించిన వాహనాలను గుర్తించి వాటని ఫోటో తీసి సదరు వాహనదారుడు ఏవిధమైన ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడినాడో మొదలైన వివరాలను ఆన్‌లైన్‌ పద్దతి నమోదు చేయబడుతాయి. రోడ్డు రవాణ శాఖ సంబంధించిన కంప్యూటర్‌ సర్వర్‌ అనుసంధానం కావడంతో, వెలుబడిన సదరు వాహనదారుని సమాచారం ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలను ఆతిక్రమించిన వాహనదారుని డ్రైవర్‌ సేల్‌ఫోన్‌కు సదరు వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ గల వాహనం యజమానికి ట్రాఫిక్‌ నియంబంధనలు ఉల్లంఘించిన ప్రదేశం, సమయం,తేది మొదలైన వివరాలను తెలియపస్తు, ఇందుగాను విధించిన జరిమానాకు సంబంధించిన సంక్షిప్త సందేశాన్ని పంపించడబడుతుంది. ట్రాఫిక్‌ విభాగం నుండి సంక్షిప్త సందేశాన్ని అందుకున్న వాహనదారుడు తాను చేల్లించాల్సిన జరిమానాను స్థానిక మీ సేవా, ఈ-సేవా, టిస్‌.ఆన్‌లైన్‌, పేటియం ద్వారా కట్టాల్సి వుంటుంది.

ఆధే విధంగా ట్రాఫిక్‌ అధికారులు ప్రత్యక్షంగా నిర్వహించే తనీఖీల్లో వాహనదారుడు ఏదైనా నిబంధనను అతిక్రమిస్తే సదరు వాహనదారునికి సమాచారాన్ని అన్‌లైన్‌ పద్దతిలో నమోదు చేసి వాహనదారుడు సైతం ఇదే రీతీలో జరిమానాలను కట్టాల్సి వుంటుంది..