వరంగల్ లో ఇద్దరు  అంతర్‌రాష్ట్ర దొంగలు అరెస్టు భారీగా బంగారం వెండి అభరణాలు స్వాధీనం

-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. రవీందర్‌

తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడతున్న ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలను శనివారం సి.సి.ఎస్‌ పోలీసులు అరెస్టు చేసారు.

అరెస్టు చేసిన నిందితులు సుమారు 35లక్షల విలువగల 900 గ్రాముల బంగారు అభరణాలతో పాటు, 12కిలో వెండి అభరణాలు మరియు మూడు ద్వీచక్రవాహనాలు, రెండు సెల్‌ఫోన్లు, నేరాలకు వినియోగించిన పనిముట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల అరెస్టు చేసిన నిందితుల వివరాలు:

1. దిలీప్‌ పవార్‌, తండ్రి పేరు గుర్జియా, వయస్సు 25, నివాసం బగోలి, కుక్షీ తాసిల్‌, ధార్‌ జిల్లా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం.

2. సర్వన్‌ పవార్‌, తండ్రి పేరు ఏడియా, వయస్సు 21, నివాసం భడ్‌కచ్‌, కుక్షీ తాసిల్‌, ధార్‌ జిల్లా,మధ్యప్రదేశ్‌ రాష్ట్రం.పోలీసులు అరెస్టు చేసిన నిందితులు ఇద్దరు చదువును మధ్యలోనే మానేసారు.

నిందితులిద్దరు రోజువారి కూలీ చేసుకోవడంతో పాటు ఇరువురు దూరపు బంధువులు కావడంతో వీరి మధ్య స్నేహం చిగురించి ఇద్దరు కల్సి మధ్యం సేవించడంతో పాటు, కల్సి జల్సాలు చేసేవారు. దీనితో వీరూ చేసే జల్సాలకు తామ సంపాదించే అదాయం సరిపోకపోవడంతో నిందితులిద్దరు చోరీ చేసేందుకు సిద్దపడ్డారు.

తమ ప్రాంతంలో చోరీలకు పాల్పడితే గుర్తుపడుతారని ఇందుకోసం తమరని గుర్తించకుండా వుండేందుకుగాను నిందితులు రైల్వే మార్గం వున్న ప్రాంతాల్లో చోరీలు చేసేందుకు ప్రణాళికను రూపోందించుకున్నారు , నిందితులు తమ ప్రణాళికలో భాగంగా వరంగల్‌ ప్రాంతాన్ని ఎన్నుకోని చోరిలకు పాల్పడ్డారు..