వరంగల్ అర్బన్ జిల్లాల్లో పిడుగులుపడి ముగ్గురు మృతిచెందారు. జిల్లాల్లో వడగండ్ల వానకు పలుచోట్ల పంటనష్టం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గొర్రెలకాపరి నీలం ఫకీర్‌యాదవ్(50) పిడుగుపడి మృతి చెందాడు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో, స్టేషన్‌ఘన్‌పూర్ మార్కెట్‌లోని ధాన్యంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా మెట్ట ప్రాంత మండలాలైన హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరుగగా, మామిడి చెట్లు విరిగిపడ్డాయి. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరికి చెందిన రైతు చిల్పూరి మహేందర్‌రెడ్డి(32) పిడుగుపడి మృతి చెందాడు.