దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు

కాశిబుగ్గ సిటీ ఆవరణలో దసరా ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేయించాలని కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షుడు దూపం సంప త్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటి లోను, అలాగే వరంగల్ సీపీ రవీందర్ ను కోరారు. 30 సంవత్సరాలుగా ఓసిటీ మైదానంలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని, ఏటా యాభై అడుగుల రావణాసురుడి ప్రతిమను రూపొందించి బాణ సంచాతో దహనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాది మంది ఈ ఉత్సవాలను తిలకించేందుకు వస్తారని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు పసునూటి దయాకర్, బండా ప్రకాష్, ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, మేయర్ నన్నపునేని నరేందర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేశారు.