నాట్యం నేర్పిస్తామని బాలిక పై అత్యాచారయత్నం

ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా జరిగిన ఒక సంఘటన జిల్లాలో కలకలం రేపింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలో ఒక గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి ఈనెల 7న ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేయబోయారు. బాలికకు నృత్యం నేర్పుతామని చెప్పి గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి సాయి, రమేశ్‌లు అత్యాచారయత్నం చేశారు.

సమయానికి బాలిక బంధువులు గుర్తించడంతో పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. వారిపై నిర్భయ చట్టం నమోదైంది.