నేటి నుంచి హస్తకళ మేళా..

హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టిటిడి కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కళాభారతి చేనేత హస్తకళల నేల ఈ రోజు ప్రారంభం కానుంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ రిబ్బన్ కత్తిరించి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభిస్తారని కళాభారతి హస్త చేనేత కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు రుద్ర ప్రసాద్ తెలిపారు.