వరంగల్ భూకబ్జా పట్టించుకోని అధికారులు
వరంగల్ అర్బన్ నాయుడు పంపు : వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలంలోని ఉర్సు శివారు మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 159 సర్వే నెంబర్లో మొత్తం పంతొమ్మిది గుంతలు కాగా 159/ఏ సర్వే నెంబర్ లో గల పది గుంటల భూమి సోల్తి రాజాగౌడ్ బొల్లికుంట గ్రామానికి చెందినది కాగా 159/బి మాడురి చేరాలు తొమ్మిది గుంటల భూమి అని రికార్డులు చెపుతున్నాయి అయితే ఇందులో నుండి రోడ్ కోసం మొత్తం ఆరు గుంటలు పోగా అందులో రెండు గుంటలు రాజాగౌడ్ కు సంబంధించింది కాగా నాలుగు గుంటలు చేరాలకు చెందినదని అయితే చేరాలు అనే వక్తి అతనికి ఉండవలసిన భూమి కంటే ఎక్కువ మొత్తలో తప్పుడు డాక్యూమెంట్లతో వేరొకరికి రెజిస్ట్రేషన్ చేయించి భూకబ్జాలకు తెరలేపడంతో సోల్తి రాజాగౌడ్ భూమిని సర్వే చేయిద్దామని ఎన్నిసార్లు చెప్పి నోటీసులు పంపిన వాళ్ళు తీసుకోకుండా నీకు ఇక్కడ భూమి లేదని భయబ్రాంతులకు గురిచేస్తూ వచ్చారు.
అయినా భూమి సర్వే చేయించి తనకు రావలసిన భూమి 159/ఏ లో తాను రెజిస్ట్రేషన్ చేయించిన రెండు సార్లు గొడవలు అయినా కొత్త తిరుపతి మరియు నెలకుంట్ల నారాయణ రెడ్డి మల్లి అదే భూమిలో రాజాగౌడ్ కబ్జాలో వున్నా భూమిలో నాలుగు రోజుల క్రితంఎవ్వరు లేని సమయంలో చెట్లు తొలగించగా అదితెలుసుకున్న రాజాగౌడ్ తెల్లవారినతర్వాత వెళ్లిచూడగా అక్కడ పనిచేస్తున్న వారిని నాభూమిలో మీరెందుకు పనిచేస్తున్నారని అడగగా తిరుపతి కొడుకు మరియు తిరుపతి నానాభూతులు తిడుతూ కొట్టడానికి రావడంతో రాజాగౌడ్ పోలీస్ స్టేషను ఆశ్రయించగా పిటిషన్ తీసుకోని అక్కడకు వెళ్లి పని అపి వారందరిని పిలిచి వదిలేయడం , ఈ రోజు మళ్ళి రాజాగౌడ్ భూమిలో పని చేయడంతో అది తెలుసుకున్న అతను అక్కడకు వెళ్లి నా భూమిలో మళ్ళి ఎందుకు పనిచేస్తున్నారని అడగగా భూతులు తిడుతూ ఎవ్వానికి అయిన చెప్పుకో అందరు నవాళ్ళే అని నువ్వు ఏంచేసినా నీకు ఇక్కడ దిక్కెవరు ఉండరని భేదిరించగా ఆయన 100 కు డయల్ చేసిన ఎవ్వరు రాకపోగా చూసి చూసి ,
ఆయనే పోలీస్ స్టేషనుకి వెళ్లిన అక్కడున్న వాళ్ళు ఎవరు పట్టించుకోపోగా మనస్థాపానికి గురై అయన దిక్కుతోచని స్థితిలో తన గోడు వెల్లబోసుకోవడం జరిగింది ఇప్పటికైనా భూములను కబ్జాలు చేస్తూ అమాయక ప్రజల భూములలో తిష్టవేస్తున్న వారిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని అయన అధికారులను వేడుకోవడం జరిగింది.