పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 21వ తేదీన జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జనవరి 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనరేట్ వి రవీందర్ తెలిపారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇద్దరికి మించి జనాలు గుంపుగా తిరగడం, సమావేశాలు నిర్వహించడం చెయ్యొద్దన్నారు.

నగరంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని , 5రోజుల పాటు ర్యాపిడి యాక్షన్ పోలీస్ ల ఆధ్వర్యంలో కావత్ ను కమిషనర్ రవీందర్ ప్రారంభించారు. ర్యాపిడ్ యాక్షన్ కామాండ్ ప్రవీణ్ , ఏసీపీ చంద్రయ్య, సుబేదారి సిఐ ,ఎస్సై లు , పోలీసులు పాల్గొన్నారు.